
రాహుల్ పై సస్పెన్షన్ ఎత్తివేయడం హర్షనీయం
రాహుల్ గాంధీ పై సస్పెన్షన్ ఎత్తివేసి లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి తెలిపారు. గురువారం వారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటన దురదృష్టకరమని ఈ ఘటన బిజెపి నిరంకుశ పాలానికి నిదర్శనమని భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించకపోవడం బిజెపి ప్రభుత్వ అసమర్థత అని అన్నారు. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని భారతదేశ ప్రజలు తలదించుకునే విధంగా మరల ఇటువంటి చర్యలు పునరావతం కాకుండా చూడాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కోదాడ నుండి ఎమ్మెల్యేగా తాను బరిలో నిలుస్తానని అన్నారు. గత 30 సంవత్సరాలుగాఎంతోమంది పేద విద్యార్థులను తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేశానని తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి తన శక్తి మేరకు సేవ చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మన ఊరు మన కాంగ్రెస్ నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వారి వెంట ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈఓ ఎస్.ఎస్ రావు ఉన్నారు