

పాండవుల గుట్ట ప్రాంగణంలో హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన
జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓ తో కలిసి గుట్టలను సందర్శించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి శివారులో ఉన్న బుగులోనీ జాతరలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు కోటి 50 లక్షల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాండవుల గుట్టలను, బుగులోని జాతర ప్రాంగాణాన్ని పరిశీలించారు.అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ పర్యటక ప్రాంతాల, దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం కొండమీదికి ఎక్కే మెట్లు కోటి 50 లక్షల రూపాయలతో వెడల్పు చేస్తున్నామని అన్నారు. జాతర ప్రాంగణంలో స్వామివారి కల్యాణ మండపం, భక్తుల విశ్రాంతి హాల్, కోనేరు వెడల్పు, మంచినీటి బావి మరమ్మత్తు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ పనులన్నీ చేపడుతామని అన్నారు. పాండవుల గుట్ట సమీపంలో హెలిక్యాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ కు ఫారెస్ట్ అధికారులు వెంటనే రెవెన్యూ అధికారులకు స్థలాన్ని కేటాయించాలని కోరారు.అటవీ శాఖ అధికారులు వెంటనే రెవెన్యూ అధికారులకు బదలాయింపు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు,అటవీ అధికారులు గౌతమి,వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య,రేగొండ మండలం అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు, బుగులోని జాతర చైర్మన్ రొంటాల వెంకటస్వామి, తిరుమలగిరి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, నాయకులు గంగుల రమణారెడ్డి,మేకల బిక్షపతి, మోడెమ్ ఉమేష్ గౌడ్, ఆకుతోట తిరుపతి, పల్నాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.