
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
రేగొండ మండల కేంద్రంలో సోమవారం కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు ఇంచార్జ్ ఆకారపు శంకర్ ఆధ్వర్యంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తెలంగాణ కుమ్మరి సంఘం రేగొండ మండల అధ్యక్షులుగా దుంపేటి బిక్షపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆకారం శంకర్ మండల కమిటీని ఏకగ్రీవంగా నియమించారు.మండల కేంద్రంలోని రావులపల్లికి చెందిన దుంపేటి బిక్షపతి మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైనట్లు జిల్లా ఇన్చార్జి ఆకార శంకర్ తెలిపారు. ఉపాధ్యక్షులుగా దుంపేటి పోషాలు, మండల ప్రధాన కార్యదర్శిగా చిగురు మామిడి మోహన్, కోశాధికారిగా ఆరుట్ల రఘు, సహాయ కార్యదర్శిగా నాంపల్లి శంకర్, కార్యదర్శిగా అన్నారపు రాజేందర్, ప్రచార కార్యదర్శిగా అన్నారపు సతీష్, సలహాదారులుగా అన్నారపు శంకరయ్య, పెద్దపెల్లి రమేష్, శనిగీరపు వెంకన్న, అన్నారపు భాస్కర్, దుంపేటి నాగరాజులను ఏకగ్రీవంగా నియమించినట్లు శంకర్ తెలిపారు.నూతన అధ్యక్షులుగా నియమితులైన దుంపేటి బిక్షపతిని జిల్లా,మండల నాయకులు శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా నియమించిన కుల సంఘం రాష్ట్ర,జిల్లా,మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.కుమ్మరి కుల సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం నాయకులు ఇటకాల రమేష్, కూనారపు రఘు, సముద్రాల రాజు, కొండపర్తి ఇస్తారి, ఆవు నూరి రామన్న, ఓదెల చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.