
రేపాల గ్రామంలో ఘనంగా ఉట్ల పండగ
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో రేపాల గ్రామంలో శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ మొగిలిచర్ల కృష్ణ ఆధ్వర్యంలో ఉట్ల పండగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ మాట్లాడుతూ రేపాల గ్రామ పరిసర ప్రాంత భక్తులంతా ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు. రేపాల గ్రామ భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క ఉట్ల పండుగను తిలకించినారు. ఇట్టివేడుకను తిలకించడానికి వచ్చిన భక్తులు స్వామివారి యొక్క కృపలో పాత్రులైనారు. ఇట్టి కార్యక్రమంలో రేపాల యాదవ సంఘం. మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు సాయి చార్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.