
telugu galam news e69news local news daily news today news
మునగాల:సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని రేపాల గ్రామాన్ని మండల కేంద్రం చేస్తూ ప్రత్యేక నూతన మండల ఏర్పాటు చేయాలని మొదలైన ఉద్యమం మరో ముందడుగు వేసింది. శనివారం మునగాల మండలం సీతానగరం గ్రామంలో రేపాల మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ జేఏసీ అధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ పుల్లూరి ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సీనియర్ జర్నలిస్ట్ గంట సోమన్న ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంత ప్రజలు తన ఉనికి కోసం ప్రత్యేక మండలం కోరడం నేరం కాదని అన్నారు.తెలంగాణ రాష్ట్రం కూడా ఇలాంటి వివక్ష కారణంగానే ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వం ఆలోచన చేసి, రేపాల కేంద్రంగా ప్రత్యేక మండలం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి సహకరించాలని కోరారు.అనంతరం 20 మందితో గ్రామ జేఏసీని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు పల్లపు సతీష్,కొట్యా నాయక్, లెక్కల సుధాకర్,పగడాల నాగరాజు,స్వామిలాల్,రేపాల గ్రామ జేఏసీ నాయకులు పి.రంగా,మొగిలిచర్ల సత్యనారాయణ,పేరెల్లి బాబు, కుంటిగొర్ల వెంకన్న,తోకల సైదులు తదితరులు పాల్గొన్నారు.