
*సిపిఎం చేపట్టిన సర్వేలో పలు సమస్యల వెల్లడి*
*రైతాంగ పోరాటాల ద్వారానే రైతుల సమస్యలు పరిష్కారం*
*పథకాల అమలు,రైతు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉదృతం*
*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్*
ఈ69న్యూస్ జఫర్ గడ్
రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని,రైతాంగ పోరాటాల ద్వారానే రైతుల సమస్యలు, వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు.రామాలయం నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి గురువారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,మండలంలో ఉన్న గ్రామాల్లో పేరుకుపోయిన పలు సమస్యలు,రైతులకు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని తాసిల్దార్ శంకరయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు.అనంథరం మాట్లాడుతూ.. దేశంలో నూటికి 70 శాతం మంది రైతులు వ్యవసాయ మీద ఆధారపడే ఉన్నారు.వారికి సరియైన సదుపాయాలు కల్పించకపోవడంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ దేశాల్లో వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే,మోడీ ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు ఇవ్వకుండా అంబానీ,ఆదానిలాంటి కార్పొరేట్ సంస్థలకు వస్తావా పలుకుతున్నారని,వేలాది ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు దారా దస్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మోడీ ప్రభుత్వం సాగునీటి కోసం ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సంపూర్ణంగా నిర్మించలేకపోయానీ ఎద్దేవ్య చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ సంపూర్ణంగా చేయకుండా రుణమాఫీ పూర్తి అయిందని అసెంబ్లీలో ప్రకటించడం మోసపూరిత చర్య అని అన్నారు.ఎన్నికల సందర్భంగా రైతులకు బ్యాంకులో ఎంత అప్పు ఉన్న రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని,ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల పైన రైతులకు రుణమాఫీ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలోనే జనగామ జిల్లాలో జాఫర్గడ్ మండలంలో భూగర్భ జలాలు అట్టడిగి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోవడం జరిగింది.ప్రతి పంటకు ఎకరానికి నష్టపరిహారం 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు.ఆరు గ్యారెంటీల పథక అమలుపైన,స్థానిక సమస్యల పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ఏడాదిన్నర నడుస్తున్న సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వివరించడం ప్రభుత్వ అసమర్ధతకు అర్థం పడుతుందన్నారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను పూర్తిగా సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.పేదల ఓటుతో గెలిచిన ఎంపీలు ప్రజా సమస్యలు పార్లమెంటులో లేవనెత్తడం లేదని తీవ్రంగా మండిపడ్డారు.పార్లమెంట్ సభ్యులు జీతాలు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ పేదల సమస్యలపై పరిష్కరించడంలో లేదని ఆందోళన చెందారు.ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని,నేడు వందల మందితో జరిగిన ధర్నా, భవిష్యత్తులో వేల మందితో జరిపేందుకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు.అనంతరంతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ శంకరయ్యకు అందజేయగా,అందించిన తాసిల్దార్ తన పరిధిలో సమస్యలను పరిష్కరిస్తా,సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు,రాపర్తి సోమయ్య,సిపిఎం మండల కార్యదర్శి గుండెబోయిన రాజు,మండల కమిటీ సభ్యులు కాట సుధాకర్,వడ్లకొండ సుధాకర్,రాపర్తి రజిత,నల్ల తీగల శ్రీనివాస్,నక్క యాకయ్య,ముక్కెర రాజు,అజయ్,రాములు,రమేష్,రాజు,నరేష్,వెంకటమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.