రైతుల చేతుల్లోకి ఆధునిక యంత్రాలు
ఆధునిక యంత్రాలతో వ్యవసాయానికి నూతన శక్తి
వ్యవసాయ పనుల్లో యంత్రాలతో ఎంతో సౌలభ్యం
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో డోర్నకల్ నియోజకవర్గ స్థాయి వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హాజరై వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు,ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల వ్యవసాయ పనులు సులభతరం చేసి ఉత్పాదకత పెంచే లక్ష్యంతో వ్యవసాయ యంత్రాల పంపిణీ చేసారు,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందజేశారు,ఆధునిక యంత్రాల వినియోగంతో ఖర్చులు తగ్గి, సమయం ఆదా అవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రైతుల చేతుల్లోకి ఆధునిక యంత్రాలు రావడం వల్ల వ్యవసాయ పనులు సులభతరం అవుతుందని సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు,ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పలువురు రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందించిన యంత్రాలు తమకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమం రైతుల్లో ఉత్సాహాన్ని నింపి వ్యవసాయ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది అన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి,యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమళ్ళు,మాజీ జడ్పిటిసి మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామ్ లాల్, గంధసిరి అంబరీష, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు రవి నాయక్,జాటోత్ సురేష్ నాయక్, వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారి బి సరిత,మరిపెడ డివిజన్ సహాయ వ్యవసాయ అధికారి వి.విజయ్ చంద్ర, మండల స్థానిక వ్యవసాయ అధికారి బి.వీరా సింగ్, నియోజకవర్గంలోని మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులు నరసింహారావు, కురవి మండలం రాంనర్సయ్య,తొర్రూర్ మండల్ జి స్వామి నాయక్, పెద్దవంగర ఛాయారాజ్, సిరోల్ మండల వ్యవసాయ విస్తారణ అధికారి వినయ్ కుమార్,అన్ని మండలాల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు