
మునగాల మండలం పరిధిలోని రేపాల గ్రామ రెవెన్యూ పరిధిలో గల నర్సింహులగూడెం గ్రామంలో బుధవారం యాసంగి వరి ధాన్యం కొనుగోలు ఐకెపి కేంద్రమును ప్రారంభించిన రేపాల గ్రామ రైతు సమన్వయ సమితి కన్వీనర్ పల్లి ఆదిరెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని. రైతులు దళారులను నమ్మవద్దని పండించిన ప్రతి గింజను ఐకెపి కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తొమ్మిది ఏళ్ల కాలంలో వరి ధాన్యం అధిక శాతం పెరిగాయని. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన వరి ధాన్యం ధర కింటాకు ఏ గ్రేడ్ 2060 రూపాయలు బి గ్రేడ్ ధర 2040 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు వారంలోపు జమ అవుతాయి అన్నారు .ఈ కార్యక్రమంలో సంఘ బంధం అధ్యక్షురాలు సోమపంగు జ్యోతి,సారిక పెద్దరామయ్య,గండు కాశయ్య, వరికేల చంద్రయ్య,సోమపంగు వెంకటేశ్వర్లు,సారిక బచ్చయ్య, రైతులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు