
ఈ 69 న్యూస్ వరంగల్,ఆగస్టు 27
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడప శంకర్ ప్రస్తుతం వరంగల్ మాధవ్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య ఆసుపత్రికి చేరుకొని శంకర్‌ను పరామర్శించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాయపురం సాంబయ్య వైద్యులతో మాట్లాడి శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పార్టీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.కుటుంబ సభ్యులను ధైర్యపరుస్తూ,శంకర్ పార్టీకి ఎంతో నిబద్ధతతో సేవలందించిన నాయకుడని గుర్తుచేశారు.పరామర్శ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు,కార్యకర్తలు కూడా ఆసుపత్రికి చేరుకుని శంకర్ త్వరగా ఆరోగ్యవంతుడై ప్రజాసేవలో తిరిగి పాల్గొనాలని అందరూ కోరుకున్నారు.