రోడ్డు భద్రత పాటించండి- సీఐ వేణు
దసరా సందర్భంగా ఊర్లకు వెళ్ళే ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సీఐ వేణు సూచించారు.పరిమిత వేగంతో ప్రయాణించాలి,మద్యం సేవించి వాహనం నడపరాదు,రాత్రి డ్రైవింగ్‌లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ద్విచక్రవాహనదారులు హెల్మెట్,కారులో సీటు బెల్ట్ తప్పనిసరి అని గుర్తుచేశారు.పండుగ కాలంలో దొంగతనాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని,ఇంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.బంగారం,నగదు బ్యాంకు లాకర్లలో భద్రపరచాలి,సీసీ కెమెరాలు,సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ ఉపయోగపడతాయని అన్నారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని,సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో ఫోన్ నంబర్ నమోదు చేయాలని సీఐ వేణు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.