- రూ.700 కోట్లతో రోడ్లు, మౌలిక సదుపాయాలు..
- గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..
- దూదేకులపల్లి,గొల్లబుద్ధారం గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి


రాష్ట్రంలో ఉన్న లంబాడి తండాలు,గిరిజన గూడేల అభివృద్ధికి కృషి చేస్తానని,సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రూ.700 కోట్ల నిధులను కేటాయించినట్లు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వికలాంగు,వృద్ధుల సంక్షేమ మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి మండలం దూదేకులపల్లి,గొల్లబుద్ధారం గ్రామాల్లో బీటీ రోడ్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.అనంతరం గొల్లబుద్ధారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడేలు,లంబాడి తండాల్లో ప్రజలకు అవసరమైన విద్య,వైద్యం,కరెంటు,రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.అందులో భాగంగా రూ.700 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు.గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.అందుకు రోజుకు 18 గంటలు పని చేస్తూ,రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు.గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.మంత్రి హోదాలో భూపాలపల్లి నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు,స్థానిక కాంగ్రెస్ నాయకులకు,లంబాడ,గిరిజన కుటుంబ సభ్యులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
భూపాలపల్లి నియోజకవర్గానికి మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు వచ్చిన మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు.ఈ మేరకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని సభా వేదికపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు,తండాలు, గుడాలు,పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నామని,సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి,సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వం గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు.ముఖ్యంగా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.