
telugu galam news e69news local news suryapeat news nadigudem news
గళం న్యూస్ :నడిగూడెం, జనవరి 20 మండల కేంద్రం లోని రత్నవరం గ్రామంలోని లేబర్ కార్డు ఉన్న సిఎస్ సి హెల్త్ కేర్ డిస్టిక్ కో-ఆర్డినేటర్స్ చల్ల తారక్, రాకేష్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పగడాల పద్మాప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సిఎస్ సి హెల్త్ కేర్ వారు ఉచితంగా 52 రకాల పరీక్షలు నిర్వహించడం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని,ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు, సిఎస్సి హెల్త్ కేర్ వారు రత్నవరం గ్రామాన్ని ఎంచుకొని వైద్య పరీక్షలు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో పగడాల భూపాల్ రెడ్డి, కారం శెట్టి శ్రీనివాసరావు, మొలుగూరి నరసింహారావు, పసుపులేటి గోపి, గుండు వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.