
ఈ69న్యూస్ వరంగల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరించేవని ఆరోపిస్తూ,వరంగల్లో మంగళవారం అఖిల భారత ట్రేడ్ యూనియన్ల సమాఖ్యలు,రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు వందలాది మంది కార్మికులు పాల్గొన్న ఈ ర్యాలీలో కార్మిక చట్టాలను రద్దు చేయాలని,కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని,కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.”లేబర్ కోడ్ల”అమలుతో యూనియన్ల ఏర్పాటు కష్టమవుతుందని,ఉద్యోగ భద్రతకూ భంగం కలుగుతుందన్నారు.కార్మిక సంఘాల నేతలు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.