
వంగపహాడ్ లో ఆసరా స్టోర్ ప్రారంభించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఈ69న్యూస్ హనుమకొండ
గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగేందుకు ఆసరా స్టోర్లు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.మంగళవారం హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో ఓమినీ మార్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆసరా స్టోర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. మహిళలు సమూహంగా ఏర్పడి తయారు చేసిన ఉత్పత్తులను స్వయంగా విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నామని, రాజీవయువశక్తి పథకం ద్వారా ఆర్థిక సహాయంతో మరిన్ని స్టోర్లు ప్రారంభించాలన్నారు.ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.