
ఈ69న్యూస్ సీతానగరం
వంగలపూడి గ్రామ నూర్ ముబారక్ మసీదులో అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.మసీదు గురువు మహమ్మద్ అక్బర్ ప్రసంగిస్తూ,రంజాన్ పండుగ ప్రతి ముస్లిం ముప్పై రోజులు కఠిన ఉపవాస వ్రతాన్ని పాటించి,సంతోషంతో జరుపుకునే పవిత్ర వేడుక అని తెల్పుతూ,ఈద్ పండుగకు ఉన్న విశిష్టతను వివరిస్తూ,పరస్పర ప్రేమ,సామరస్యాన్ని పెంపొందించే సందేశాన్ని ఇచ్చారు.అదేవిధంగా మానవాళిని దేవునితో అనుసంధానం చేయడం,పరస్పర హక్కులను గౌరవించడం ముఖ్యమని పేర్కొన్నారు.ఈద్ సందర్భంగా పేదలకు దానం చేసే ఫిత్రానా దానధర్మాల యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశారు.అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ ఇచ్చిన సందేశాన్ని తెలియజేస్తూ,ఈద్ అంటే కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా,తోటి మానవుల పట్ల ప్రేమ,కరుణ,సహాయ సహకారాలకు ప్రతీక అని తెలిపారు.ఈ వేడుకల్లో గ్రామ ముస్లింలందరూ పాల్గొని ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు,సామూహిక ప్రార్థన అనంతరం పరస్పరం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపుకున్నారు.ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు షేక్ ఖాసిం ఫరూక్, షేక్ నాగూర్ సాహెబ్, షేక్ అహ్మద్ అలీ ఉద్దీన్, షేక్ లాల్ సాహెబ్,షేక్ నబి సాహెబ్,గాలిబ్ సాహెబ్,షేక్ దాదాసాహెబ్ షేక్ షేక్ తాజుద్దీన్,షేక్ మస్తాన్ గాంధీ కాసిం సాహెబ్ సుర సాహెబ్ పిల్లలు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.