వరద బాధితులకు సర్ఫ్ ఉద్యోగుల అండ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిఆర్డిఓ సర్ఫ్ ఉద్యోగులు ఏటూరునాగారం వరద బాధితుల విషయంలో తమదాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసిన పద్మజారాణి ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిఆర్డిఓ పిడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల భారీ వర్షాలు వరదలకు ఏటూరు నాగారం మండలం పరిధిలోని దొడ్ల, మల్యాల, కొండాయి గ్రామాలు వరద ముంచెత్తడంతోపాటు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిఆర్డిఓ పిడి పద్మజారాణి తను పని చేసిన జిల్లాలో జరిగిన ఘటనపై కలత చెందారు. తమవంతుగా వారికి అండగా నిలవాలని భావించారు. జిల్లాలో పనిచేసే డి ఆర్ డి ఓ ఉద్యోగులకు విషయం వివరించి …తోచినంత సహాయం చేయాలని… స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకుందామని పిలుపునిచ్చారు.
దీంతో స్పందించిన ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు సుమారు రూ.1.50 లక్షలు సేకరించారు ఈ మొత్తం డబ్బులతో నేరుగా కంపెనీలకు వద్దకు వెళ్లి వంట సామాగ్రి కొనుగోలు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి వాహనంలో ఎటురునాగారం తరలించి స్థానికుల సహకారంతో వరద బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన సెర్ప్ ఉద్యోగులను పిడి పద్మజారాణి ప్రత్యేకంగా అభినందించారు. ఉద్యోగులు మాట్లాడు తూ బాధితులకు సహకారం అందిస్తున్న క్రమంలో వారు ఎంతో సంతోషించారని వారికి తమ వంతు సహకారం అందించే అవకాశం కల్పించిన పిడి గారికి ధన్యవాదాలు తెలిపారు. ముంపు బాధితులను ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలోమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
డి.ఆర్.డి.ఏ సిబ్బంది, సెర్ప్ సిబ్బంది యం.జి.యన్.ఆర్.ఈ.జి.యస్ సిబ్బంది లత డి.పి.యం శీలం ప్రభకర్ డి.పి.యం తెలుగు మునిస్వామి ఎ.పి.యం ఆర్.రామ చంద్రారెడ్డి, రాజేశ్ లు తదితరులు ఉద్యోగులు అందరి పక్షాన తాము వచ్చి బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు