
ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ కొడకండ్ల.
జనగాం జిల్లా, కొడకండ్ల మండల కేంద్రం లోని ఏడునూతుల గ్రామం లో కరెంట్ షాక్ కీ గురై కాళ్ళు చేతులు సచ్చు పడిపోయి 5 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మచారి కుటుంబం గురించి న్యూస్ ఇండియా రిపోర్టర్ గుర్రం ప్రభాకర్ ,ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ ప్రసన్న కుమార్ కీ తెలియజేయగానే వెంటనే కుటుంబాన్ని పరామర్శించి వారి పరిస్థితిని తెలుసుకొని వారి కుటుంబానికి అండగా నిలవడానికి…ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాట్స్ ఆప్ గ్రూపుని వేదికగా చేసుకొని అందులో ఆ కుటుంబ పరిస్థితి గురించి వివరిస్తున్న వీడియో ని పోస్ట్ చేయగా వెంటనే 50 మంది గ్రూప్ సభ్యులు స్పందించి ఫోన్ పే & గూగుల్ పే ద్వారా 51000 ల రూపాయలను, 75 కేజీలా బియ్యం, నిత్యవసర వస్తువులను జమ చేయడం జరిగింది.. ఏడునూతుల గ్రామానికి చెందిన జీలుకర కళమ్మ & యుగేందర్ ల కుమారుడు కిరణ్ ప్రతీ నెల బాధితుడికి కావాల్సిన మెడిసిన్స్ ఎంత ఖర్చు అయినా నెల నెల పంపిస్తాను అని మాట ఇచ్చారు, బాధితుడి యొక్క చిన్న కుమార్తె చర్మ వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలుసుకున్న జనగామ మైనారిటీ అధ్యక్షులు షేక్ సద్దాం అమ్మాయికి అండగా నిలిచి హాస్పిటల్ ఖర్చులు భరిస్తాను అని మాట ఇచ్చారు… ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు వాట్స్ ఆఫ్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ కీ వెంటనే కొడకండ్ల, పాఖాల, హైదరాబాద్, సూర్యాపేట, ఏడునూతుల, కాన్వాయిగూడెం, వావిలాల, తొర్రూర్, రామవరం, జాఫర్గాడ్, కడవెండి నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులు, సామాన్య ప్రజలు, బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ సభ్యులు, యువకులు, పెద్దలు, నాయకులు స్పందించి తోచిన ఆర్ధిక సాయం చేయగా ఈ రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇద్దరి ఆడ పిల్లల పేరు మీద 40000 ల రూపాయలను పోస్టాఫీసు సుకన్య లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సుకన్య బుక్స్ ని అడపిల్లల చేతికి ఇవ్వడం జరిగింది… మిగిలిన 11000 ల రూపాయలను మందుల కొరకు కుటుంబానికి అందివడం జరిగింది. ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ కొడకండ్ల ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాట్స్ ఆప్ గ్రూప్ లో పోస్ట్ చేయగానే కొన్ని గంటల వ్యవదిలోనే స్పందించిన 50 మంది సభ్యులను అభినందించారు అలాగే ఎక్కువ మంది దాతలు కొడకండ్ల మండలం నుండి ఉండటం తో చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు…భవిష్యత్ లో ఎవరికి ఆపద ఉన్న ఇలాగే స్పందించి కొన్ని వేల కుటుంబాలకు అండగా నిలబడాలని దాథలను కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాట్స్ ఆఫ్ గ్రూప్ సభ్యులు, మసురం. వెంకట్నారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయులు దోర్ణం ప్రభాకర్, సూర్య న్యూస్ రిపోర్టర్. వీరదాసు.నవీన్, న్యూస్ ఇండియా రిపోర్టర్ గుర్రం. ప్రభాకర్,రామవరం GHMS ఎడెల్లి.మహేందర్, మోడల్ స్కూల్ పీడీ. జెరూపోతుల సుధాకర్, మై రెడీమర్ స్కూల్ ఇంచార్జ్ నాగాలాండ్ సునేప్ సార్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.