
వాసవి క్లబ్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి వారోత్సవాలు
వాసవి యూత్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో బుధవారం కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి ఉత్సవాల్లో భాగంగా, పాత్రికేయులు వంగవీటి శ్రీనివాసరావు, మిట్టపల్లి శ్రీనివాసరావు, కందిబండ హరీష్ కు మెమెంటో ఇచ్చి, శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ రిజియన్ చైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ… కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి వారోత్సవాల్లో భాగంగా, బుధవారం కోదాడ పట్టణంలో ఆరో రోజు పాత్రికేయులను ఘనంగా సన్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్, శ్రీనివాసరావు,లక్ష్మణ్,భరత్, నవీన్,తదితరులు పాల్గొన్నారు.