
telugu galam news e69news local news daily news today news
నూతన ప్రభుత్వం గత పాలకుల తప్పిదాలు చేయొద్దు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు ఎంబర్స్మెంట్ చార్జీలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్ చేశారు ……………..
.మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న 7800 కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న డైట్ బిల్లులను విడుదల చేయాలని, రాష్ట్రంలో విద్యారంగంలో ఖాళీగా ఉన్న 26 వేల ఉపాధ్యాయ పోస్టులు, ఉపాధ్యాయేతర పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉన్నత విద్యలో టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా ట్యూషన్ ఫీజు,మెస్ ఫీజులు రావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఇంటర్మీడియట్ ,10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ మెనూ అందించాలని, జిల్లాలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మండల కేంద్రాల్లో లేని చోట ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో,నాయకులు బానోతు బాలాజీ.వసంత, అనిల్, రాహూల్ , ప్రవీణ ,చందు యాకూబ్ తదితరులు పాల్గొన్నారు