విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి యువ గర్జన
పోరాడి తెచ్చుకున్న రాష్టంలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం లేదని కెయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ తిరుపతి యాదవ్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. అనుకుంటే ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా విద్యార్థి నిరుద్యోగుల హక్కుల కోసం నిరంతరం కె.సి.ఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న జనగామ జిల్లా విద్యార్థి జేఏసీ పోరాటం తోనే జనగామ జిల్లా సాధించడం జరిగిందన్నారు. కె.సి.ఆర్ ఇచ్చిన పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇండస్ట్రీయల్ కారిడార్ హామీలు మరిచి ఇక్కడ ఎమ్మెల్యే బుకబ్జాదా రుడుగా మారి కోట్లు దండుకున్నది ప్రజల అందరికి తెలిసిందే ఆన్నారు. భూకబ్జా దొంగ ను పక్కన పెట్టి విద్యను దోపిడీ చేసి కోట్లు దండుకున్న ఇంకొకరు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు యువకులు జాగ్రత్త గా ఉండాలి ఈ సారి విద్యావంతుడు విద్యార్థి ఉద్యమకారుడు లాంటి వాణ్ణి ఎమ్మెల్యే ఎన్నుకునే ఆలోచన చేయాలన్నారు. కొత్తగా ఈ నియోజకవర్గానికి వచ్చి ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పే వాడు తన యూనివ ర్సిటీలో జనగామ అభివృద్ధి కోరుకునే వాడివి అయితే ఈ జనగామ నియోజకవర్గంలో 1000మంది విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్లు ఇచ్చి అడుగుపెట్టాలని హెద్దేవా చేశారు. ఈ ప్రాంత విద్యార్థి యువకులు అందరూ ఈ 90రోజులు ఓటు ప్రాధాన్యత, డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకొనే వాళ్ళు తరువాత ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో ప్రజలకు వివరించే బాధ్యత తీసుకొని కె.సి.ఆర్ ప్రభుత్వం కి బుద్ది చెప్పాలని అన్నారు
ఈకార్యక్రమంలో డా.కల్నల్ భిక్షపతి ఓయూ జేఏసీ నాయకులు సంతోష్ న్యాయవాదీ సాధిక్ అలీ చేర్యాల జేఏసీ కన్వీనరు చక్రధర్, తదితరులు ప్రసం గించారు. కార్యక్రమంలో నిర్వాహకులు జనగామ జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ పిట్టల సురేష్, కన్వీనర్ మంగలపల్లి రాజు గన్ను కార్తిల్ ,తుంగ కౌశిక్ ,గద్దర్ కృష్ణ గుగ్గిళ్ల నర్సన్న తదితరులు పాల్గొన్నారు.