విద్యార్థులు పరీక్షల పట్ల భయము వీడి ప్రణాళికతో సిద్ధమైతే విజయం సులభం అవుతుంది
-హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధి పల్లె రాజిరెడ్డి
E69news జఫర్ఘడ్ మార్చి 24
హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దాతలు నక్క బిక్షపతి రామ్ పేట్ వాస్తవ్యుల ఆర్థిక సహాయంతో ఫౌండేషన్ ప్రతినిధి,సామాజిక సేవకులు పల్లె రాజిరెడ్డి శుక్రవారం నాడు జఫర్గడ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ..విద్యార్థులు పరీక్షల పట్ల భయము వీడి ప్రణాళికతో సిద్ధమైతే విజయం సులభం అవుతుందని అన్నారు.పరీక్షలలో భయం లేకుండా సులువుగా ఉత్తీర్ణత సాధించేందుకు పలు అంశాల పట్ల వారు అవగాహన కల్పించారు.విద్యాభ్యాసంలో పరీక్షలు సహజమని వాటిని ప్రణాళిక బద్ధంగా చదువుతూ ఉత్సాహంగా ఉండాలన్నారు. లాస్సింగ్ థెరపీ,యోగా ఆరోగ్య సూత్రాలను ఏకాగ్రత,మేధో శక్తి పెంచుకునే మార్గాలను సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు చాడ గణేష్ రెడ్డి,ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.