
ప్రైవేట్ టీచర్స్ విద్యారంగానికి చాలా సేవ చేస్తున్నారని , సమాజ నిర్మాణంలో ప్రైవేట్ టీచర్స్ ఇప్పుడు చాలా కీలకమని , ప్రైవేట్ టీచర్స్ లేనిదే విద్యా రంగం ముందుకు పోని స్థితి ఉందని ఇంటర్మీడియేట్ ఆర్ జే డి బి. బి.జయప్రద బాయి మేడమ్ అన్నారు.
ఈరోజు ఎన్నో ఏళ్లుగా విద్యారంగానికి సేవ చేస్తున్న ప్రైవేట్ టీచర్స్ సేవలను గౌరవిస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) మేడ్చల్ మల్కాజిగిరి కమిటీ ఆధ్వర్యంలో Ecil , లయన్స్ క్లబ్ హల్ లో భగత్ సింగ్ 116వ జయంతి ని పురస్కరించుకొని సీనియర్ ప్రైవేట్ టీచర్స్ సభ నిర్వహించడం జరిగింది. అలాగే ప్రైవేట్ సీనియర్ టీచర్స్ ని సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా జయప్రద బాయి మేడం ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. భగత్ సింగ్ జయంతి పురస్కరించుకొని ప్రైవేట్ టీచర్స్ సేవలను గుర్తిస్తూ అభినందన సభ నిర్వహించడం చాలా గొప్ప విషయం అమె అన్నారు. ప్రైవేట్ టీచర్స్ సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం అవసరం. అదే సందర్భంలో వారు ఎథికల్ గా కూడా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. టీచర్ వివక్ష లేకుండా ఉంటేనే విద్యార్థులు బాగా రిసీవ్ చేసుకుంటారు. పేపర్స్ దిద్దడంలో కూడా చాలా బాధ్యతతో ఉండాలనీ మేడమ్ అన్నారు.
ప్రజా సైంటిస్ట్ టి. రమేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు సైంటిఫిక్ దృక్పథం కలిగించడంలో టీచర్స్ పాత్ర చాలా ముఖ్యం. క్లాస్ లో ఓన్లీ సాధారణ విద్యార్థులు మాత్రమే ఉండరు. భవిష్యత్ మేధావులూ ఉన్నారు. ఉంటారు కాబట్టి 40మంది మెదడు కు పనిబెట్టే పని టీచర్స్ చేయాలి. సైన్స్ ప్రపంచాన్ని మార్చింది. ఐన్స్టీన్ వల్ల సెన్స్ లో విప్లవం వచ్చింది. సాధారణ స్టూడెంట్ గా ఉన్న ఐన్స్టీన్ గొప్ప మార్పు చేశాడు. ప్రశ్నే ఆయనను గొప్పవానిగా మార్చింది. ప్రశ్నను పెంచితే సమాజం బాగా డెవలప్ అవుతుందని ఆయన అన్నారు. గొప్ప వాళ్ళను తయారు చేయడంలో నిజమైన ఆనందం ఉంటదని ఆయన అన్నారు.
TPTLF రాష్ట్ర కన్వీనర్ ఏ. విజయ్ కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ బ్రిటీష్ సామ్రాజ్య వాదులను ఈ దేశం నుండి తరిమికొట్టడానికి ఉరికొయ్యలను ముద్దాడాడు. తన ప్రాణాన్ని తృణ ప్రాయంగా ఈ దేశ ప్రజలకోసం అర్పించాడు. భవిష్యత్ తరాల కోసం తన త్యాగం చేయటానికి కారణం అప్పటి తన టీచరే కారణం. వారి స్ఫూర్తి తోనే భగత్ సింగ్ ఒక గొప్ప వీర యోధుడిగా మార గలిగాడు. ఆ యోధుడి వీర మరణం వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయన ఆశయ బాటలో పోరాటాల్లోకీ వచ్చి అనేక యూత్ పోరాడారు. అలాంటి పోరాట యోధుల తయారీలో టీచర్ పాత్ర చాలా కీలకం అయ్యిందీ. నేటి సమాజంలో అలాంటి వారీ పాత్ర చేయాలంటే భగత్ చరిత్రను నేటి విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత నేటి ప్రైవేట్ టీచర్ మీద పడిందని ఆయన అన్నారు.
అలాగే టీచర్స్ డిమాండ్స్ పై చర్చించారు.
ప్రైవేట్ టీచర్స్ సేవలను ప్రభుత్వం గుర్తించాలి
ప్రైవేట్ టీచర్స్ ని ప్రభుత్వం రిజిష్టర్ చేయాలి
ప్రైవేట్ టీచర్స్ కి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ప్రైవేట్ టీచర్స్ కి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి
ప్రైవేట్ టీచర్స్ ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం రిజిష్టర్ చేసి సరైన ప్రాధాన్యం ఇవ్వాలి
ఈ కార్యక్రమానికి కొమ్ము విజయ్ అధ్యక్షత వహించారు. ఉప్పల్, కీసర MEO శశిధర్ సార్ టీచర్స్ లెక్చరర్స్ ని సన్మానించారు. SFI జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్, అలాగే TPTLF నాయకులు నరేష్, టీచర్ సురేందర్ సార్, రవి సార్, సునిల్, సాయి కిరణ్ , 150మంది టీచర్స్ తదితరులు పాల్గోన్నారు.