
ఈ69న్యూస్ హన్మకొండ
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లేని పాలన కొనసాగుతుందని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు.బుధవారం రోజున ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శాంపేట సెంటర్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం నర అవుతున్న కూడా ఇప్పటివరకు విద్యారంగ సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు.విద్య రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య రంగాన్ని బ్రష్టు పట్టిచ్చే విధంగా వారి యొక్క పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అన్నారు.విద్యార్థులు ఏరుకొని తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రభుత్వ పాలన బాగోలేదన్నారు.రాష్ట్రంలో 7,200 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉంది అన్నారు.పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు పెండింగ్ బకాయిలు విడుదల కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి పాలన లేదు అన్నారు.విద్యాశాఖకు వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్య సంస్థల్లో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలి అన్నారు.లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శాయంపేట మండల అధ్యక్షులు ఇస్మాయిల్ సాయి కుమార్ అఖిల్ కన్నారావు సన్నీ శశాంక్ మంద అజయ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.