telugu galam news e69news local news daily news telugu news
జాగృతి పోలీస్ కళా బృందం,వరంగల్ నగర పొలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ ఆదేశాల మేరకు రాత్రి 7:00 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు స్టేషన్ ఘనపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనాధపురం గ్రామంలో చదువు,రోడ్డు ప్రమాదాలు,డయల్100, బాల్య వివాహాలు,సిసి కెమేరాలు,మరియు గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని,మూఢ నమ్మకాలపై మేజిక్ షో,ముసలి తల్లి తండ్రులను మంచిగ చూసుకోవాలని,తదితర అంశాలపై పాటల ద్వార, మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తు1930 సైబర్ టోల్ నంబర్ గురించి అవగాహన పరచామని సిఐ సట్ల రాజు తెలిపారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్,కళాబృందం ఇంచార్జి ఉమెన్ ఎఎస్సై నాగమణి సభ్యులు,హె.సి విలియమ్,వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,నారాయణ,విక్రమ్రాజు, చిరంజివి మరియు గ్రామ ప్రజలు మొత్తం 250 మంది,పాల్గొన్నారు.