
ఘనంగా గోవిందా రావు పేట మండలం లోనీ పలు గ్రామాలలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు గోవిందా రావు పేట మండల కేంద్రంలో పాస్టర్ రొని గారి ఆధ్వర్యములో మరియు చల్వాయి,కోట గడ్డ గ్రామాలలో చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
అందరినీ ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమన్నారు. క్రీస్తు బాటలో నడిస్తే ఈ ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవని, యుద్దాలకు ఆస్కారం లేదని అన్నారు. అన్ని మతాల సారం మానవత్వమే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే అని ములుగు నియోజక వర్గ ప్రజలకు క్రిస్మస్ శుభా కాంక్షలు ఈ క్రిస్మస్ పండగ అందరి కుటుంబాలలో వెలుగులు నింపాలని సీతక్క ప్రార్థించారు