వీర తెలంగాణ సాయుధ పోరాట నిప్పు కణిక చిట్యాల ఐలమ్మ అని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. స్థానిక మంచి కంటి భవన్లో వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి కార్యక్రమం జరిగింది ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి అన్నవరపు కనకయ్య నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విస్నూర్ దేశ్ ముఖ్ రజాకార్ల అరచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ అని అన్నారు. తమను దొర అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీ మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గ రుండి అఘాయిత్యం చేయించే రాక్ష నిజాం పాలనలో ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరెవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించు కోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడ బాధ్ని లా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని ఆయన కొనియాడారు.మల్లంపల్లి భూస్వామి కొండలరావు కు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది అందులో నాలుగు ఎకరాలు సాగు చేశారు. పాలకుర్తి పట్వారి వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడిన సందర్భంలో జీడి సోమ నరసయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలుగా చేరిందని ఆ తర్వాత పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పని చేయ డానికి నిరాకరించి ఎదురు తిరిగిన దిశాలి ఐలమ్మ అని అన్నారు.పాలకుర్తి పట్వారి ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్ దేశ్ ముఖ్ రాపాక రాo చంద్ర రెడ్డికి ఫిర్యాదు చేశాడు కేసులో అగ్ర నాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా వచ్చిందని ఐలమ్మ కుటుంబాన్ని ధాన్యం తమదేనని పంటను కోసుకు రమ్మని 100 మందిని దేశ్ ముఖ్ ఐలమ్మ భూమి మీదికి పంపగా ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరి కట్టలు కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారని ఆయన తెలియజేశారు .భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి చాకలి యాదగిరి సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారని అన్నారు రజాకారుల ఉపసేనాధి పతి అయిన దేశ్ ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడని ఓటమిని తట్టుకోలేక ఐలమ్మ ఇంటిని తగలబెట్టి , ధాన్యాన్ని ఎత్తుకెళ్లారని, ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారి ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారని అన్నారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్రజెండను వీడలేదని నేటి తరం కూడా ఇదే స్ఫూర్తితో పోరాట బాటలో నడవాలని పిలుపునిచ్చారు .ఈ దొరగాడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరోడు ఏం చేస్తాడు రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేత భూని గుండాలను తరిమికొట్టింది కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరిన వీర వనిత అని కొనియాడారు. ఐలమ్మ భూ పోరాటంలో విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంలో మొదలుకొని సాయుధ రైతాంగ పోరాటంలో ఎర్రజెండా చేతబట్టి వెట్టికి వ్యతిరేఖంగా పోరాడింది అని అన్నారు.నేటి సమాజంలో మహిళలు తమపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు వ్యతిరేఖంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తితో దైర్యంగా పోరాడాలని ఆయన పిలుపనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీను,పట్టణ కమిటీ సభ్యులు సందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, ఎమ్మెస్ ప్రకాష్, బిక్కులాల్ , బాలకృష్ణ,సంధ్య,సలీం,రసూల్ బి తదితరులు పాల్గొన్నారు