
***తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి**తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్*నెల్లుట్ల: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో పేదలు ఇళ్లస్థలాల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ అన్నారుజనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల/పటేల్ గూడెం గ్రామంలో ప్రభుత్వ భూమి అడ్డదారిన కొంతమంది ఆక్రమించుకుంటుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుర్తించడం జరిగింది.ఈ 7వ రోజు కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్ అధ్యక్షత వహించగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేసి మాట్లాడుతూ…. భూమికోసం భుక్తి కోసం పెట్టి జాతర విముక్తి కోసం తెలంగాణ పోరాట పురిటిగడ్డ జనగామ ప్రాంతమని ఈ ప్రాంతంలో ధరలను జాగిదారులను జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉన్నదని 10 లక్షలు ఎకరాలు భూమి పేదలకు పంచడంతో పాటు మూడువేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటులో క్రియాశీల పాత్ర ఉన్నదని అటువంటి ఈ ప్రాంతంలో గత వారం రోజులుగా అట్టి భూమిలో చుట్టుపక్కల నివసిస్తున్న పేద ప్రజలను సమీకరించి పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎలాంటి చలనం లేదని అన్నారు.వేలాది ఎకరాలను పెట్టుబడిదారులకు అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్న పట్టించుకోని అధికారులు అట్టి భూములను అధికార పార్టీ వారికి కట్టబెడుతున్న ప్రభుత్వాలు పేద ప్రజలను నివసించడానికి 100 గజాల స్థలాన్ని అడుగుతే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టుమని పదిమంది కూడా ఇవ్వని పరిస్థితి దాపరించిందని జిల్లాలో కనీసం 100 మందికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వనివారు ఎన్నికల ముందు మాత్రం మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెపుతూ మరో పక్క ఇంటి స్థలాలు లేక పేదలందరూ గుడిసెలు వేసుకోవడానికి సిద్ధపడతా ఉంటే 75 గజాల ఇట్టి స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఊరుకో ఐదారిచ్చే చేతులు దులుపుకునే పరిస్థితి ఉందని,ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమగ్ర సర్వే ప్రకారం ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ జిల్లాలోని ప్రభుత్వ భూమిని వారికి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారులు మత్స కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగల రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాపురం మహేందర్ కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం యాదగిరి రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పయ్యావుల బిక్షపతి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుడిసెల రాములు నల్ల లక్ష్మయ్య నల్ల వెంకటయ్య రమేష్ గుడిసె వాసులు పాల్గొన్నారు