
వేయి స్తంభాల దేవాలయంలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, హనుమకొండలోని ప్రాచీన వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు,మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీమతి కొండ సురేఖ గారు, శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) గారు,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు,వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులలో సగం మంది వరంగల్ నగరానికి విచ్చేసి, బతుకమ్మ పండుగలో పాల్గొనడం మా నగరానికి గౌరవంగా భావిస్తున్నాం.బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంస్కృతిక సంపదకు జీవం పోసే పర్వదినంఅని అన్నారు.ఇది పూల పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతి పట్ల మన బంధాన్ని, ఆడబిడ్డల మనోభావాలను, మరియు తల్లి గౌరమ్మ పట్ల భక్తిని వ్యక్తపరిచే పండుగ అని తెలిపారు.ఇలాంటి పండుగలను వేడుకలా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు అందిస్తోందని,ప్రతి తెలంగాణ యువతికి, మహిళకు బతుకమ్మ పండుగ గర్వకారణం అవాలి ఆకాంక్షించారు.మన సంస్కృతి, మన విలువలను భవిష్యత్ తరాలకు అందించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,ఎమ్మెల్యేలు కే అఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ రావు,KUDA చైర్మన్ ఇనగల వెంకట్రామ్ రెడ్డి,రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు నేరెళ్ల శారద,పటేల్ రమేష్ రెడ్డి,కాల్వ సుజాత, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరిష్,నగర మేయర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.