పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రురు, పెద్దవంగర, రాయపర్తి, మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సమస్యలు, హామీ ధరల అమలు, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది..అధికారులను వారు అడిగి తెలుసుకున్న అంశాలు, మండలాల వారీగా రైతుల నమోదు వివరాలు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల అందుబాటుపై సమాచారం, అవసరమైన ఎరువుల నిల్వల పరిస్థితి, పంటల ఆధారంగా పరిస్థితి, రైతు మద్దతు ధరల అమలు, గత సీజన్లో ఎదురైన సంక్షోభాలు, పరిష్కార చర్యలు, రైతుబంధు, రైతుభీమా వంటి పథకాల అమలులో ఉన్న లోపాలు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలాలే. ఇక్కడి రైతులు కాలానికి అనుగుణంగా సాగు పద్దతులను అవలంబిస్తున్నారు. అందుకే వారికి కావాల్సిన వనరులు, సూచనలు, తగిన మద్దతు సరైన సమయంలో అందించాలి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలి. విత్తనాలు, ఎరువులు దొరకడం ఆలస్యం అయితే, సీజన్ పూర్తిగా దెబ్బతింటుంది. ఆ కారణంగా రైతు సంక్షోభానికి గురవుతారు. మీరు వ్యవహరిస్తున్న ప్రతి అంశంలో సమయపాలన చాలా ముఖ్యం. ప్రజాప్రతినిధిగా నేనూ ప్రతీ మండల పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాను. అధికారుల భాగస్వామ్యంతోనే రైతుల ఆకాంక్షలు నెరవేర్చగలం..సమావేశంలో వ్యవసాయ శాఖాధికారులు తమ శాఖల పరిధిలో జరుగుతున్న పనులను వివరించారు. ఎమ్మెల్యే గారి సూచనలను గమనిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..ఈ సమీక్ష సమావేశం నియోజకవర్గవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది..