వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పత్తి రైతుల కపాస్ కిసాన్ యాప్ లో రైతుల వివరాలు రాకపోవడం అన్యాయం,వెంటనే సవరించాలని అదనపు జిల్లా కలెక్టర్ గారికి వినతి తెలంగాణ రైతు సంఘం పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య కోరారు.ఈ సందర్భంగా మంగ బీరయ్య మాట్లాడుతూ..జనగామ పట్టణం లో 40 మంది రైతులు పత్తి పంట సుమారు 60 ఎకరాలలో సాగు చేశారని, పత్తి పంట సాగు చేసిన రైతుల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేయకపోవడం వలన చేతికి వచ్చిన పంట అమ్ముకోవడం కాపాస్ కిసాన్ యాప్ లో వివరాలు రాకపోవడం వలన సిసిఐకి అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని దీని వలన దళారులకు విక్రయించడం వల్ల రైతుల పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని ఆపు గత పది రోజుల నుండి పనిచేయడం లేదని స్లాట్ బుక్ కావడం లేదని కాబట్టి ఆపను రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బండ శ్రీశైలం సోమేశ్ అంజయ్య తదితర రైతులు పాల్గొన్నారు