
శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో ముఖ్య అధితిగా పాల్గొన్న బొజ్జపల్లి సుభాష్
జఫర్ ఘడ్ మండలం హిమ్మత్ నగర్ శక్తి కేంద్రలోని 252, 253, 254 పోలింగ్ బూత్ పరిధిలో హిమ్మత్ నగర్ చౌరస్తా లో ప్రజా గోస – బీజేపీ భరోసా శక్తి కేంద్ర ఇంచార్జ్, మెరుగు రామరాజు గారి అధ్యక్షతన మండల అధ్యక్షులు తౌటి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యఅతిథిలుగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ మరియు అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మంద వెంకటేష్ గార్లు పాల్గొన్నారు
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ దృఢంగా తయారైంది ఎన్నో పేద ప్రజలకి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క నియంతృత కేసీఆర్ పాలనలో అవి ప్రజలకు లబ్ధి చెందకుండా పేర్లు మార్చుకొని ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కానీ, పెన్షన్ కార్డుల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయం ఏ విషయంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం పేద ప్రజలకు అందించే విషయంలో విఫలమైందని వారు విమర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం సభ్యులు బుర్ర తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి కొరుకొప్పుల నగేష్ గౌడ్, సోషల్ మీడియా మండల కన్వీనర్ పులి శ్రావణ్ కుమార్ గౌడ్, దళిత మొర్చ మండల అధ్యక్షులు ఇళ్ళందుల సారయ్య, శక్తి కేంద్ర ఇంచార్జ్ మేకల పవన్ యాదవ్,బూత్ అద్యక్షులు శ్రీనివాస్ తాటికాయల బాబు, మండల,గ్రామ నాయకులు,వివిధ మోర్చా నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.