రవీంద్ర నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ
రవీంద్ర నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి డి ఈ ఈ ప్రశాంత్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రవీందర్ నాయక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ ఏ.కృష్ణ నాయక్ మాట్లాడుతూ…. ఫలకనుమా రైల్వే స్టేషన్ రోడ్ రవీందర్ నాయక్ నగర్ రోడ్డు కొత్త రోడ్డు నిర్మాణం శాంక్షన్ అయ్యి గత రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు కాంట్రాక్టు రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రజలూరి రోజు వారిగా రాను పోను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని జిహెచ్ఎంసి ఈఈ గారి దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లిన ఫలితం లేని పరిస్థితి వీటితో పాటు కాంట్రాక్ట్ వారి పైన చర్యలు తీసుకుని వెంటనే కొత్త రోడ్డు పనులు ప్రారంభించాలని రవీంద్ర నాయక్ నగర్ కాలనీలో కొత్త రోడ్డు నిర్మాణం అభివృద్ధిలో పనులు వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా జిహెచ్ఎంసి డి ఈఈ కి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేందర్ నాయక్ నగర్ కాలనీ నాయకులు గౌతమ్ నాయక్ శ్రీను రాజేష్ సేవు తదితరులు పాల్గొన్నారు