
badrachalam news
కార్యాలయానికి వచ్చే గిరిజనులకు వారికి అవసరమైన శాఖ ఎక్కడ ఉన్నది, తెలుసుకోవాలంటే శాఖల వారీగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారము మరియు సీరియల్ నెంబర్ ప్రకారము మార్కింగ్లు ఉండాలి- ఐ టి డి ఎ, పీ ఓ
ఐటీడీఏ కార్యాలయానికి కొత్తగా వచ్చే గిరిజన ప్రజలకు మరియు ఇతర ప్రజాప్రతినిధులకు కార్యాలయంలో ఎన్ని శాఖలు ఉన్నవి, ఎక్కడెక్కడ ఉన్నవి పూర్తిస్థాయి సమాచారం తెలిసే విధంగా చార్టులు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఐటీడీఏ కార్యాలయంలోని నూతనంగా నిర్మించిన సమావేశ మందిరమును మొదలుకొని రెండో అంతస్తు లోని విభాగాలను కింది విభాగాలను పూర్తిస్థాయిలో తిరిగి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల కుటుంబాలను ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లడానికి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలను నెలకొల్పడం జరిగిందని అన్నారు. కార్యాలయానికి వచ్చే గిరిజనులకు వారికి అవసరమైన శాఖ ఎక్కడ ఉన్నది, తెలుసుకోవాలంటే శాఖల వారీగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారము మరియు సీరియల్ నెంబర్ ప్రకారము మార్కింగ్లు ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన బోర్డు కార్యాలయం ఎదురుగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే ఆ కార్యాలయం శాఖలకు వెళ్లడానికి బాణాల గుర్తులు వేయించాలని ప్రతి కార్యాలయం గదులు శుభ్రంగా ఉంచుకోవాలని, పనికిరాని సామానులు ఏమైనా ఉంటే పది రోజులలో పూర్తిస్థాయిలో తొలగించాలని, ప్రతి కార్యాలయం గదులు చూపరులకు కనువిందు చేసేలా అందంగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రతి కార్యాలయానికి సంబంధించిన నంబర్లు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈరోజే ప్రతి శాఖకు వేయించాలని డి ఈ హరీష్ కు ఆదేశించారు.
ఐటీడీఏ కార్యాలయం పైన కన్స్ట్రక్షన్ అవుతున్న హాలును త్వరగా పూర్తిచేసి ఏదైనా కార్యాలయం లోని విభాగాల కొరకు ఉపయోగించుకోవడానికి వీలు కుదురుతుందని అందుకు త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని ఈఈకు
ఆదేశించారు. పనికిరాని స్క్రాప్ 10 రోజులలో పూర్తిస్థాయిలో తొలగించే విధంగా సంబంధిత అధికారులు వారి వారి విభాగాలలో పనికి వచ్చే ఫైల్స్ అన్ని ఒకవైపు ,పనికిరానివన్నీ జాబితా తయారుచేసి త్వరగా తీసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ఓ సురేష్ బాబు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ ,ఏడి అగ్రికల్చర్ భాస్కర్ ,హెచ్ఎన్టిసి అశోక్ కుమార్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, టీఎ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.