
ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ జిల్లా చిన్నపెండ్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఆలయానికి ఉన్న 206 ఎకరాల భూమిని కాపాడాలనే బాధ్యత కమిటీపై ఉందని స్పష్టం చేశారు. భూముల పరిరక్షణ, కౌలు వివరాల సేకరణ, రోడ్డు నిర్మాణం, మండప నిర్మాణం వంటి అంశాల్లో తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ దేవస్థాన అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.