శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు విరాళం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని వడ్లకొండ గ్రామంలో రంగనాయకుల స్వామి గుట్ట ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు కీర్తిశేషులు పడిదెల నర్సింగరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు పడుదల వేణుగోపాలరావు అన్నపూర్ణ దంపతులు తమ వంతు సహాయంగా విరాళం 25,116లు నగదు రూపకంగా ఇచ్చినారు వారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలా ఆ భగవంతుడు సల్లగా చూడాలని కోరుకుంటున్నాము అని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు