
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి
అడిగిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య
10.8.2023 గళం న్యూస్
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తల్లాడ మండలం నూతనకల్ నుంచి గూడూరు గ్రామాల మధ్య 10 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా లోకవరం – పెనుబల్లి గ్రామాల మధ్య రెండు హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణాలకి 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలంలో మిట్టపల్లి కట్టలేరు వాగు పై చెక్ డ్యామ్ నిర్మాణానికి గాను 3 కోట్ల 37 లక్షల రూపాయలు, అంజనాపురం/రేజర్ల దేవిపాడు వాగుపై చెక్ డాం నిర్మాణానికి 3 కోట్ల 37 లక్షలు, కలకొడిమ పెద్దవాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి 2 కోట్ల 83 లక్షలు, పినపాక కట్టలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి 3 కోట్ల 73 లక్షల రూపాయలు, రంగం బంజరు జల్లవాగు పై చెక్ డ్యామ్ నిర్మాణానికి 1 కోటి 66 లక్షల రూపాయలు కుర్నవల్లి కట్టలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి 8 కోట్ల 94 లక్షల రూపాయలు , కుర్నవల్లి పెద్ద వాగు పై చెక్ డ్యామ్ నిర్మాణానికి 2 కోట్ల 32 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు.
కల్లూరు మండలం లో యజ్ఞ నారాయణపురం పెద్దవాగు పై చెక్ డ్యామ్ నిర్మాణానికి 3 కోట్ల 93 లక్షలు తాళ్లూరు వెంకటాపురం పెద్దవాగు పై చెక్ డ్యామ్ నిర్మాణానికి 1 కోటి 68 లక్షల రూపాయలు,పెరువంచ కాత్రవాని వాగు పై చెక్ డ్యామ్ నిర్మాణానికి 2 కోట్ల 15 లక్షలు నిధులు మంజూరు చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలియజేశారు.
గురువారం నిధులకు సం బంధించి ప్రొసిడింగ్ను విడుదల చేయడం పట్ల సిఎం కెసిఆర్ కు రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి కి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంటామని మరొక్కసారి నిరూపించినందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సీఎం కెసిఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు