సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం
గ్రామ అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి..
•కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి ఊరును బాగు చేసుకుంటారో…. వేరే వాళ్లకు ఓటు వేసి ఊరును ఆగం చేసుకుంటారో ప్రజలు ఆలోచించాలన్న ఎమ్మెల్యే నాగరాజు హసన్పర్తి మండల పరిధిలోని మడిపల్లి, అనంతసాగర్, జయగిరి, సీతంపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు & కూడ. చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లో 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సన్నాలకు 500రూపాయల బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, సిసి రోడ్లు నిర్మాణం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..
ఎర్ర’బల్లి’ దయాకర్ రావు నీకు సినిమాల మీద ఉన్న సోకు ప్రజల మీద లేకనే ఐదేళ్లు అభివృధి చేయలే మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయి మీద ఓడిపోయి చిన్న మెదడు చితికి అన్ని పిచ్చి పిచ్చి మాటలు కూస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ఎర్ర బల్లి’ ప్రజలు బుద్ధి చెప్పిన కూడా సిగ్గు లేకుండా ఇంకా మా సీఎం రేవంత్ రెడ్డి మీద పిచ్చి కూతలు చూస్తున్నావు మేము కాదు ప్రజలే నీ నాలుక చీరేస్తారు. మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయి మీద ఓడిపోయి చిన్న మెదడు చితికి అన్ని పిచ్చి పిచ్చి మాటలు కూస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ఎర్ర బల్లి’…మడిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిద్దేందుకు నా వంతు కృషి చేస్తా..
మడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిర్ర విజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపితే గ్రామానికి మరొక 50 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తా ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రకియ అలాగే గ్రామానికి అనుసంధానం అయ్యే రోడ్ల అన్ని తర్విగతన, గుడి, బడి అభివృద్ధి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇందిరా చీర 18 సం. నుంచి పండు ముసలి వరకు పకడ్బందీగా ఇందిరమ్మ చీరలు పంపిణీ మహిళమలకు వడ్డీ లేని రుణాలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి, ఎస్టీ సబ్ నిధులు మంజూరు చేశా, రైతు రుణ మాఫీ, బిటి నిర్మాణం జరిగింది. మడిపల్లి గ్రామ శివారులో క్రికెట్ స్టేడియం ఏర్పాటు పోరాటం చేస్తున్న గ్రామాల్లో నూతన పింఛన్లు, మహిళమణులకు తర్వలోనే 2500, గత ప్రభుత్వం ఒక డబుల్ బెడ్ ఇల్లు ఇవ్వలేదు కానీ నేడు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. గ్రామ ప్రజలందరూ బీసీ గౌడ బిడ్డ విజయ్ కుమార్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు కోరారు.అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో అనంతరసాగర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా.
అనంతసాగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రామంచ వెన్నెల ను భారీ మెజారిటీతో గెలిపితే గ్రామానికి మరొక 50 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తా ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రకియ ఎవరు అధైర్య పడొద్దు మహిళా సాధికారత కోసం కోటి మహిళలను కోటీశ్వరాలను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. ఈ గ్రామ అనంత పద్మనాభ స్వామి రాముల వారి గుడి అభివృద్ధి ఇప్పటికే 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తా నా సడిఎఫ్ నిధులు, ఎస్టీ సబ్ ప్లాన్ మొత్తం సుమారు ఇప్పటికే సుమారు 1 కోటి నిధులు మంజూరు త్వరలోనే అభివృద్ధి పనులు మొదలయితాయని అలాగే సర్పంచ్ వెన్నెల ను భారీ మెజారిటీతో గెలిపితే మరింత నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు చేస్తానని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇచ్చారు….జయగిరి గ్రామ మహిళల బతుకమ్మ స్థలం, కమ్యూనిటీ హాళ్ల భవన నిర్మాణం కోసం పరిష్కరిస్తా.
జయగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లె దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపితే గ్రామానికి మరొక 30 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తా ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రకియ ఎవరు అధైర్య పడొద్దు. గ్రామ మహిళల కోసం కమ్యూనిటీ హాల్, మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు స్థలాన్ని సర్వే చేయించి మంజూరు చేపిస్తా, కోతుల బెడద, నీటి సమస్య, పల్లె దవాఖాన, గ్రామ సమస్యలను అన్నింటినీ విడుదల వారీగా పరిష్కరిస్తా గ్రామ ప్రజలు ప్రతిపక్ష పార్టీలు చెప్పే అసత్యాలను నమ్మి మోసపోయి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు మరల ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది యువత మందుకు డబ్బుకు ఆశపడితే గ్రామం నాశనం అవుతుందని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ అభ్యర్థి పల్లె దయాకర్ కి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు…సీతంపేట గ్రామ సమస్యలను అన్నింటినీ త్వరితిగతన పరిష్కరిస్తా..*
సీతంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోకల వసంత – లక్ష్మరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపితే గ్రామానికి మరొక 50 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తా ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రకియ ఎవరు అధైర్య పడొద్దు. గ్రామంలోని అనుసంధానమైన రోడ్లన్నీ పూర్తి చేపిస్తా గ్రామానికి సుమారు 2 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారి మంజూరు చేయించ త్వరలోనే పనులు పూర్తయితాయని అలాగే గ్రామ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని మన ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డకు ఆత్మగౌరవం గా ఉండాలని ఉద్దేశంతో బతుకమ్మ చీరలు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీలు డబ్బులు వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేయాలని గొప్ప సంకల్పంతో ముందుకు వెళుతున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఓరువలేక తప్పుడు కూతలు కురుస్తున్నారు దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోకల వసంత – లక్ష్మారెడ్డి కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు కోరారు…ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, వార్డుల అభ్యర్థులు, స్థానిక నాయకులు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.