
**E69 news తొర్రూర్ డిసెంబర్ 07అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ దక్షిణ భారత ప్రచార శాఖ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం నాంచారి మడూర్ గ్రామంలో శిక్షణ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దక్షిణ భారత ప్రచార ఉప కార్యదర్శి మౌలానా సయ్యద్ ఫహీం అహ్మద్ (ఖాదియాన్ పంజాబ్) ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నేటి సమాజములో చెడు విపరీతంగా పెరిగి పోయిందని,ధర్మం భ్రష్టు పట్టిందని,ధర్మ రక్షణకు సర్వ ధర్మాలను ఏకం చేయుటకు ఈ కలియుగ కాలంలో కల్కీ అవతారునిగా 1835 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రం ఖాదియాన్ గ్రామంలో హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అవతరించారని అన్నారు.వారు స్థాపించిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ 5వ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ అయ్యదహుల్లాహు తాలా బినస్రిహిల్ అజీజ్(లండన్) ఆధ్వర్యంలో నేడు 215 దేశాలకు పైగా దేశాలలో అందరితో ప్రేమ ద్వేషం ఎవ్వరితో లేదు అనే నినాదంతో శాంతి యుతంగా సర్వ ధర్మాలను ఏకం చేయుటలో అహ్మదీయ ముస్లింలు నిమగ్నమై ఉన్నారని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రచార శాఖ ప్రతినిధులు శర వేగంగా అహ్మదీయ ప్రచారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షులు ముహమ్మద్ లతీఫ్ షరీఫ్,ఉపాధ్యక్షులు ముహమ్మద్ నజీర్,తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మౌల్వీ షబ్బీర్ అహ్మద్,ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి, యూత్ అధ్యక్షులు ముహమ్మద్ అహ్మద్ పాష,సర్కిల్ ఇంచార్జ్ ముహమ్మద్ అక్బర్ మరియుఉమ్మడి వరంగల్ జిల్లా లోని వివిధ గ్రామాల నుండి హాజరైన గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ప్రచార కమిటీ శాఖ కార్యదర్శులు,మౌల్వీలు పాల్గొన్నారు.