
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆద్వర్యంలో ఈ నెల 22,23 తేదీలలో ముఖ్దుంతండా గ్రామం నుండి ప్రారంభించి 23నా ఆర్డీవో కార్యాలయం ముందు ముగింపు జరిగే పాదయాత్రను జయప్రదo చేయాలని పార్టీ కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగిందని పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు జువారి.రమేష్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనగామ జిల్లా స్టేషన్ ఘనాపురం నియోజకవర్గoలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని గత బీఆర్ఎస్ హామీ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా చుక్క నీరు ఇచ్చినా పాపానా పోలేదన్నారు.పొలాలు ఎండిపోయినాయి భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి పశువులకు నీళ్లు దొరికే పరిస్థితి లేదు అందుకోసం ఉప్పుగల్లు గ్రామంలో రిజర్వాయర్ ద్వారా సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని ఉద్దేశ్యంతో జరుగుతున్నా పాదయాత్ర ను జయప్రదం చేయాలని ఆయన మండల రైతాంగానికి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎండి యాకుబ్ పాషా పెండ్యాల సమ్మయ్య రడాపక సత్తయ్య ఎండి జాఫర్ నాగరాజు సురేందర్ మల్లయ్య కిరణ్ తదితరులతో రైతులు పాల్గొన్నారు.