సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకి ఆదర్శం
జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే జీవితం యావత్ మహిళా లోకానికి ఆదర్శం అని రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం అధ్యక్షురాలు శోబతాయి తుల్జాపురే అన్నారు. సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చదువుల తల్లివమ్మా సావిత్రిబాయి ఫూలే పాట పాటపై చేసిన నృత్యం విశేషంగా ఆకర్షించింది్ అంతకుముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులు పేటకులే సుకుమార్ ను మహిళా సంఘం సభ్యురాలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాత జాబ్ఆడే రవి, పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి. వెంకన్న, ఏ. లక్ష్మి, పి. ఈ. టి. మమత క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ సత్తెమ్మ, కిరణ్ కుమార్, మహిళా సంఘ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.