telugu galam news e69news local news daily news telugu news
గళం న్యూస్ హన్మకొండ: సిఐటియు ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా హన్మకొండ జిల్లా సిఐటియు నాయకత్వంలో కార్మికుల మహార్యాలీ జరిగింది. బుధవారం హన్మకొండలోని వేయిస్థంబాల దేవాలయం వద్ద ర్యాలీని సిఐటియు ఆలిండియా కోశాధికారి ఎం. సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. డప్పు చప్పళ్ల నడుమ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మహా ప్రదర్శన హన్మకొండ చౌరస్తా మీదుగా అశోక్ థియేటర్ నుండి పబ్లిక్ గార్డెన్‌కు చేరింది. ఈ ర్యాలీకి ముందు సిఐటియు నేతలు ఎ. ఆర్. సింధు, లక్ష్మయ్య, టి. ఉప్పలయ్య, రాగుల రమేష్, ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, గొడుగు వెంకట్, ముక్కెర రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.