
సిపిఎం చేస్తున్న ధర్నాను విరమింపజేసిన జనగామ Rdo
ఇందిరమ్మ కాలనీ వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని సిపిఎం చేస్తున్న ధర్నాను విరమింపజేసిన
జనగామ Rdo గోపి రామ్ NH DE రాజారామ్ జనగాంC.i దామోదర్ రెడ్డిజనగామ . హైదరాబాద్ రోడ్డు
నుండి పసరమడ్ల స్టేజి వరకు నిర్మిస్తున్న ఎన్ హెచ్ ఐ 365/b బైపాస్ రోడ్డు పైరెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం చేయకుండా రోడ్డు నిర్మాణం చేయడం వలన జనగామ పట్టణ ప్రజలకుఇందిరమ్మ కాలనీవాసులకు ఏసి రెడ్డి నగర్ డబుల్ బెడ్కాలనీ వాసులకు మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు అదేవిధంగాఎల్లంల పెంబర్తి సిద్ధంకి చౌదర్పల్లి ఓబుల్ కేశపురం పెద్దరామచర్ల పోచనపేపట ప్రజలకు సుమారు పదివేల జనాభాకు రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పట్టించుకోకపోవడంతో సిపిఎం ఆధ్వర్యంలోఇందిరమ్మ ఇళ్ల వద్ద బైపాస్ రోడ్డుపై 101 రోజు నుండిరిలే దీక్షలు చేయడం జరుగుతుంది.జిల్లా అధికారులు స్పందించి సోమవారం రోజున దీక్ష శిబిరం వద్దకు జనగామ ఆర్డీవో గోపి రాము గారు ఎన్ హెచ్ ఐ డి ఈ రాజారాం గారు జనగామ సిఐ దామోదర్ రెడ్డి గారు వచ్చి దీక్షా శిబిరం వద్ద ఉన్న నాయకులతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి అండర్ పాస్ బ్రిడ్జికి నిర్మాణానికి సహకరించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చి దీక్షలను విరమింప చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకత్వం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనుక రెడ్డి మాట్లాడుతూ అండర్ పాస్ బ్రిడ్జికి సహకరించాలని జనగామ జిల్లాలో ఉన్న అన్ని అఖిలపక్ష పార్టీలను ప్రజాసంఘాలను కోరడంతో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సిపిఎం ఆధ్వర్యంలో సహకరించాలని కోరడం జరిగింది . అండర్పాస్ బ్రిడ్జి నిర్మించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అభివృద్ధి జరిగితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఆ బైపాస్ రోడ్ లో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించకపోతే ఆ ప్రజలందరికీ నష్టం జరుగుతుందని ఆ దారిన వెళ్లే మహిళలకు వృద్ధులకు పిల్లలకు నడక దారిన వెళ్లేవారికి ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా రక్షణ లేకుండా పోతుందన్నారు అధికారులు ముందుచూపు లేకుండా గతంలో డి పి ఆర్ చేయడం వలన ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయని దీన్ని సవరించి అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం జరిగే విధంగా జిల్లా అధికారులతో పాటు అన్ని పార్టీలు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు అదేవిధంగా ఈ పోరాటాన్ని సహకరించిన ఎంపీ ఎమ్మెల్యేజిల్లా అధికారులకు అఖిలపక్ష పార్టీల జిల్లా నాయకులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు కనకా రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు రోడ్డు నిర్మాణం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుఈ అహల్య బొట్ల శేఖర్జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ జిల్లా కమిటీ సభ్యులుఎండి అజారుద్దీన్ b. వెంకట మల్లయ్య పల్లెర్ల లలిత బి ప్రశాంత్ p శ్రీకాంత్ అంజమ్మ రమావత్ మిత్య నాయక్ సురేష్ నాయక్ సుమ జి మల్లేష్ దారాత్ మహేందర్ రజిత వెంకటేష్ సంపత్ హరీష్ సుగుణ స్వప్న మల్లిక రజిత ఎల్లమ్మ ఉప్పలయ్య పరమేశ్వరి లక్ష్మి పారిజాత మైబెల్లి గాడి శివ భాస్కర్ సారమ్మ తదితరులు పాల్గొన్నారు.