
ఈ69న్యూస్ జఫర్గడ్,ఆగస్టు 19
సెప్టెంబర్ 1,2024 తర్వాత అమలు చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పిఆర్టీయుటిఎస్ సంఘ ఆధ్వర్యంలో చేపట్టబోయే మహా ధర్నా కార్యక్రమ పోస్టర్‌ను జఫర్గడ్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు.మండల శాఖ అధ్యక్షులు కే.సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి యు.రామారావు,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.పద్మ,మండల,జిల్లా,రాష్ట్ర శాఖ బాధ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని,పెన్షన్ అనేది ప్రభుత్వ భిక్ష కాదని,ఉద్యోగి ప్రాథమిక హక్కు అని 1982లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు.మహా ధర్నాలో ప్రతి సిపిఎస్ ఉపాధ్యాయుడు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డి.సదానందం,శ్రావణ్‌కుమార్,రాష్ట్ర బాధ్యులు సుధాకర్,వెంకటేశ్వర రెడ్డి,జిల్లా బాధ్యులు సోమయ్య,మండల కార్యదర్శులు శివరాణి,భాస్కర్,జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.