సిపిఐ పార్టీ శతాబ్ది సభకు మండల నాయకులు
ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సిపిఐ పార్టీ 100వ సంవత్సరాల (శతాబ్ది)బహిరంగ సభకు జాఫర్గడ్ మండలం నుంచి పార్టీ నాయకులు,కార్యకర్తలు నాలుగు వాహనాల్లో బయలుదేరారు.మండల కార్యదర్శి జువారి రమేష్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల సహాయక కార్యదర్శి పెండ్యాల సమ్మయ్య,రైతు సంఘం మండల అధ్యక్షులు ఎండీ యాకుబ్ పాషా,వడ్లకొండ సుదాకర్,అన్నెపు విష్ణు,అజయ్,బుల్లె దూడయ్య,కలకోట ప్రభాకర్,మండల గట్టుమల్లు,ఎండీ నూరున్నిసా,రజియా,సింగపురం సమ్మయ్య,తోట రమేష్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.పార్టీ శతాబ్ది సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మండల నాయకులు,కార్యకర్తలు ఖమ్మం బయలుదేరినట్లు తెలిపారు.ఈ సభ పార్టీ చరిత్రలో మైలురాయిగా నిలవనుందని నాయకులు పేర్కొన్నారు.