సీఎం కప్ క్రీడల విజేతలకు బహుమతులు
సీఎం కప్ సత్తుపల్లి మండలస్థాయి క్రీడా పోటీలను మండల పరిధిలోని గంగారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుదవారం ఘనంగా నిర్వహించారు. కబడ్డీ,కోకో,వాలీబాల్ క్రీడలను నిర్వహించారు.అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డ రాజేంద్రప్రసాద్, రామ గోవిందాపురం సర్పంచ్ మందపాటి మౌనికరెడ్డి, గంగారం గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి చేతులమీదుగా అందజేశారు.ఈ సందర్భంగా దొడ్డా రాజేంద్ర ప్రసాద్(అమ్ములుబాబు) మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని,వారంలో ఒక రోజు పూర్తిగా ప్రభుత్వ,ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత కల్పించి విద్యార్థుల్లో దాగి ఉన్న ఆట గాళ్ళను వెలికితీసే ప్రయత్నం చేయాలని సూచించారు.మహిళా సర్పంచ్ లు మౌనిక,రేవతి లు మాట్లాడుతూ మెదడుకు మేత పెట్టే చదరంగం ఆట కూడా చిన్న వయస్సు నుండే విద్యార్థులకు అలవడేల ఉపాధ్యాయులు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో:ఎంపీడీవో నాగేశ్వరరావు,ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు,ఎంపిఓ జోత్స్నదేవి,పాఠశాల హెచ్ఎం జయరాజు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.