
సీఎం కేసీఆర్ ను రైతులు గుండెల్లో పెట్టుకుంటారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆదేశాలతో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు, రవి గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం లో రైతన్న సంక్షేమం లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు రైతు రుణ మాఫీ చేసి మరోసారి రైతు ప్రభుత్వం అని చాటుకుందని అన్నారు. రాష్ట్రం లోని 29లక్షల 61వేల కుటుంబాలకు రూ.19వేల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది అన్నారు, రుణమాఫీ ప్రకటనతో రైతు లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది అన్నారు తమ పంట రుణాలు మాఫీ అవుతున్నడంతో కేసిఆర్ కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నా అన్నారు సీఎం కేసీఆర్ రైతు కష్టం తెలిసిన ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు కన్నీళ్లు పోగొట్టాలని ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు రైతు బీమా ఉచిత విద్యుత్తు రుణాల మాఫీ పంటల కొనుగోలు వంటి వ్యవసాయ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తూ వ్యవసాయంగానే పండుగ చేశారు అన్నారు ఒకప్పుడు రైతు పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లిన తీరు మనం మర్చిపోలేదన్నారు అదే రైతు తెలంగాణ ప్రభుత్వంలో తల ఎత్తుకునేలా చేసిన ఘనత ఒక బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య నరసింహారెడ్డి గ్రామ ఎంపీటీసీ కొమ్ము నరేష్, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బందు పరశురాములు, రైతు కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్, అనుముల నాగిరెడ్డి, ఈరగాని ఉపేందర్, దోమల అశోక్, పాల్వాయి ఇద్దయ్య, కొమ్ము వెంకన్న, పరశురాములు, దిద్ది చంద్రు, కొమ్ము అవిలయ్య, పెండ్లి సోమయ్య, పాల్వా ఎల్లయ్య, బిఆర్ఎస్ సోషల్ మీడియా గోనె మహేష్, గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.