
మే 20,న జరిగే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె పోస్టర్లు విడుదల
కుమురం,భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలములోని విద్యావనరుల కార్యలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మే 20,న జరిగే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. అనంతరం కార్యాలయ ఉద్యోగి అయిన ఎం.ఐ.ఎస్ సమన్ గారికి మే 20,న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలియజేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది
ఈ సంధర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని
కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుంది. కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుంది. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారు, కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. రాష్ట్రంలోనే అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనం రూ, 26000/-లు తక్షణమే చెల్లించాలని. మెనూ ఛార్జీలు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనుఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ 10000/-లు చేస్తామని ప్రకటించారని గెలిచి అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఊసేలేదని. సీఎం రేవంత్ రెడ్డి మాట మతితప్పిందని గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ గాడినపడి పోతుందని అన్నారు. ఈ వైఖరీ మార్చుకొని కార్మికులకు న్యాయం చేయాలని లేని పక్షంలో కార్మిక వర్గానికి గత ప్రభుత్వాన్ని తుంగలో తొక్కిన చరిత్రవున్నదని విమర్శ చేశారు. మే 20,న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మికులు ఉపాధి హామీ రైతుకూలీలు వ్యవసాయ కార్మికులు, పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు పెరుగు విఠల్ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి మొగ్రా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు కొట్రంగి శారధ మండల అధ్యక్షులు లక్ష్మీ నాయకులు నిర్మలా మాయ పోషక్క, లు పాల్గొన్నారు