
సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన దివ్యాంగుడు
తన భూమి తనకే ఇప్పించాలని మండల రెవిన్యూ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ దున్న నాగరాజు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నిచిన సంఘటన సూర్యాపేట జిల్లా,నడిగూడెం మండల కేంద్రం లో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ చెరువు శిఖం భూమి లో ఉన్న 1:25 ఎకరాల భూమి మా తండ్రి 30 సంవత్సరాలు గా సాగు చేస్తున్నాడని 2 సంవత్సరాల క్రితం ఆర్డివో పట్టా బుక్ లు తనిఖీ చేస్తున్నాడని చెప్పి మండల రెవిన్యూ కార్యాలయం లో పనిచేస్తున్న ఉద్యోగి తమ పాస్ బుక్ లు తీసుకెళ్లి రికార్డ్ లో పట్టా నెంబర్ లేకుండా తొలిగించి మూడు సంవత్సరాలు గా మా భూమి లో సుమారు 50 సెంట్ల భూమి ని ఎమ్మార్వో కార్యాలయం పని చేస్తున్న ఉద్యోగి కబ్జా సాగు చేస్తుండగా మేము మా భూమి మీరు ఎందుకు సాగు చేస్తున్నారని అడిగితే మీకు పట్టా లేదని మమ్మల్ని బెదిరిస్తూ.. పొలం దున్నడం కోసం వచ్చే ట్రాక్టర్ వాళ్ళని రాకుండా చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.గతం లో పని చేసిన ఎమ్మార్వో లు న్యాయం చేస్తామని చెప్పారని కాని ఎమ్మార్వో లు మారుతున్నారు కాని నాకు న్యాయం జరగకపోవడం తోనే ఆత్మహత్యయత్నం చేసుకోవడం కోసం సెల్ టవర్ ఎక్కడం జరిగిందని కాని శుక్రవారం గ్రామ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తానని మండల తహసీల్దార్ నాకు హామీ ఇవ్వడం తోనే సెల్ టవర్ దిగి వచ్చానని… రేపు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం అని బాధితుడు తెలిపాడు