
జనగామ:-జనగామ జిల్లా ఇటీవల కాలంలో సోలిపురం గ్రామంలో కురుమ కులస్తులు గౌడ కులానికి చెందిన తాళ్లపల్లి పోచయ్య భూమిలో అక్రమంగా చొరబాటుకు పాల్పడుతూ భౌతిక దాడులకు దిగుతున్న వైనాన్ని ఈరోజు హైదరాబాదులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మాత్యులు వి శ్రీనివాస్ గౌడ్ కు అలాగే గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బలగొని బాలరాజు గౌడు కు గౌడ జన హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలికట్టే విజయ్ కుమార్ గౌడ్ కు గౌడ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ కు గౌడ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్‌కు గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గార్లకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సోలిపురం గ్రామంలో తను కష్టపడి కొనుక్కున్న వ్యవసాయ భూమిలో కురుమ సంఘం పేరుతో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లేశం MLC క్యామ మల్లేశం కంచె రాములు సేవెల్లి సంపత్ మరియు సోలిపురం గ్రామ కొంతమంది కురుమ సంఘం నాయకులు తన భూమిలోకి అక్రమంగా వచ్చి ఈభూమి మాదేనని ఎలాంటి హక్కులు లేకుండా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా నా వ్యవసాయ భూమిలో చుట్టూ పెట్టిన కనీలను తొలగించి నాపైన నాకు మద్దతుగా వచ్చిన పెద్దమనుషుల పైన రాల్లు కర్రలతో భౌతికదాడులు చేస్తూన్నారు. అక్రమంగా నా భూమిలో ప్రవేశించడమే కాకుండా ఈ భూమి నాది కాదనడం ఇది కురుమ కులం వారికే చెందుతుందని కురుమలకు ఊరుకునేది లేదని గౌరవ ఎమ్మెల్సీ స్థానంలో ఉండి యిగ్గే మల్లేశం గారు వివరిస్తున్న తీరు వివిధ పత్రికల్లో వచ్చిన ప్రకటనలను మంత్రిగారికి అలాగే గౌడ సంఘాల రాష్ట్ర నాయకులకు వివరించి తన గోడును వెళ్లవచ్చుకున్నారు.సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్‌కు విచారణ జరిపి తగు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.అలాగే గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు త్వరలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కేసిఆర్ గారి దృష్టికి తీసుకుపోతామని అలాగే జనగామ సోలిపురం భూములను సందర్శించి అక్కడ జరుగుతున్న తీరుతనులను పరిశీలిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోచయ్య వెంట కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి జిల్లా కార్యదర్శి భాల్నె వెంకటమల్లయ్య జనగామ మండల మాజీ MPP బైరగోని యాదగిరి గౌడ్ జొన్నగొని సుదర్శన్ గౌడ్ వంగ భీమయ్య గౌడ్ వంగ రామరాజు గౌడ్ నాగపురి మల్లేశం గౌడ్ నాగపురి వీరస్వామి గౌడ్ బొమ్మెన మహేందర్ గౌడ్ వంగ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.