
స్కార్పియో వాహనం షార్ట్ సర్క్యూట్ వల్ల వెహికల్ కాలిపోయింది
ఐటిడిఎ కార్యాలయంలోని దాదాపు 25 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు అధికారి కోసం కొనుగోలు చేసిన స్కార్పియో వాహనం షార్ట్ సర్క్యూట్ వల్ల వెహికల్ కాలిపోయింది
వెహికల్ లో మంటలు చెలరేగాడంతో సిబ్బంది అంతా అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగిందని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు
మధ్యాహ్నం ఐటీడీఏ కార్యాలయం అవవరణలో నిలిపి ఉంచిన ఈ స్కార్పియో వాహనం నుండి అకస్మాత్తుగా పొగలు రావడంతో పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై మంటలు చెలరేగాకుండా జాగ్రత్త పడడంతో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్కార్పియో వాహనం నుండి పొగలు రావడం ఆగగానే ఆ వాహనమును అక్కడి నుంచి షెడ్డు కి తరలించడం జరిగిందని ఆయన అన్నారు. సిబ్బంది ముందుగానే అప్రమత్తమై పొగలు రావడం చూడడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అన్నారు.